"Nirvann Applications Private Limited (గతంలో Applex Technologies Private Limited అనే పేరుతో ఉండేది)" - “UTSAV APP” బ్రాండ్ పేరుతో పనిచేస్తున్న ఈ సంస్థ మీకు పూర్తి సంతృప్తి కలిగించడానికి కట్టుబడి ఉంది. మీరు Utsav App నుంచి డిజిటల్/భౌతిక వస్తువులు/సబ్‌స్క్రిప్షన్/సేవను ఆర్డర్ చేసి, అందుకున్న ఉత్పత్తి/సేవతో సంతృప్తిగా లేకపోతే, ఆర్డర్ చేసిన తేదీ నుంచి 10 రోజుల్లోపు అభ్యర్థిస్తే రద్దు, మార్పిడి లేదా రీఫండ్/పాక్షిక రీఫండ్ పొందడానికి మీరు అర్హులు.
రద్దు విధానం
డిజిటల్ వస్తువులు/సేవలు తప్ప, ఆర్డర్ చేసిన తర్వాత, ఆర్డర్ చేసిన 10 రోజుల్లోపు లేదా ఆర్డర్ స్టేటస్ “PUJA OFFERED” గా అప్‌డేట్ కాకముందు (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) మీరు ఆర్డర్ రద్దు కోసం అభ్యర్థించవచ్చు.
డిజిటల్ వస్తువులు / సేవలను కొన్న తర్వాత రద్దు చేయడానికి వీలుండదు.
రద్దు అభ్యర్థనను Utsav App నుంచి చేయవచ్చు, లేదా contact@utsavapp.in కు మాకు రాయవచ్చు, లేదా మా కస్టమర్ హెల్ప్‌లైన్ నంబర్లు : +91 6291087857 లేదా +91 8044630858 లో కాల్ / వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
వాపసు & రీఫండ్ విధానం
భౌతిక పార్సిళ్లకు మా దగ్గర 10 రోజుల మార్పిడి / రీఫండ్ విధానం ఉంది. అంటే మీ పార్సిల్ అందుకున్న తర్వాత 10 రోజుల్లోపు మీరు వాపసు కోసం అభ్యర్థించవచ్చు. (లోపం ఉన్న, దెబ్బతిన్న లేదా తప్పుగా పంపిన ఉత్పత్తులు మాత్రమే వాపసుకు లేదా మార్చి ఇవ్వడానికి అర్హమైనవి)
మార్పిడి / రీఫండ్ అభ్యర్థన మొదలుపెట్టడానికి, contact@utsavapp.in కు మాకు ఈమెయిల్ చేయవచ్చు, లేదా మా కస్టమర్ హెల్ప్‌లైన్ నంబర్లు : +91 6291087857 లేదా +91 8044630858 లో కాల్ / వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
మార్చి ఇవ్వమని లేదా రీఫండ్ ఇవ్వమని కోరడానికి గల కారణాలతో పాటు, మీకు అందిన పార్సిల్ ఫోటోలు/వీడియోలను మీరు పంచుకోవాలి.
కొనుగోలు సమయంలో హామీ ఇచ్చిన పార్సిల్‌కు, నిజంగా అందిన పార్సిల్‌కు మధ్య పరిమాణం లేదా నాణ్యత విషయంలో ఏదైనా తేడా కనిపిస్తే, మీరు ఉచితంగా మార్చి ఇచ్చే సదుపాయానికి, లేదా ఎంపిక చేసిన కొన్ని సందర్భాల్లో పూర్తి/పాక్షిక రీఫండ్‌కు కూడా అర్హులు.
పూర్తి/పాక్షిక రీఫండ్ ఇచ్చిన సందర్భంలో, రీఫండ్ చేసిన మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడానికి 3-7 పని దినాలు పట్టవచ్చు.
మార్చి ఇచ్చే, మార్పిడి చేసిన ఉత్పత్తులను 5-7 పని దినాల్లో పంపుతాం.
Utsav App తన కస్టమర్లకు కట్టుబడి ఉంది. పైన రాసిన మా విధానానికి మేము కట్టుబడి ఉంటూనే, మీ అసంతృప్తిని ఎలా పరిష్కరించగలమో, మీకు ఇంకా బాగా ఎలా సేవ చేయగలమో అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. మా విధానానికి సంబంధించిన ఏ ప్రశ్నలకైనా, లేదా మేము మీకు ఎలా సహాయం చేయగలమో తెలియజేయడానికి, దయచేసి contact@utsavapp.in లో Utsav App ను సంప్రదించండి.
Utsav App
(Nirvann Applications Private Limited (గతంలో Applex Technologies Private Limited అనే పేరుతో ఉండేది))
వ్యాపార కార్యాలయం - Haralur Road, H.S.R Layout, Bengaluru, Karnataka - 560102
రిజిస్టర్డ్ కార్యాలయం - Unit No. 705, Om Tower, 32, Chowringhee Road, Kolkata
West Bengal - 700071
ఈమెయిల్ - contact@utsavapp.in
సంప్రదింపు నంబర్ - +918044630858